నీళ్లపల్లిలో ఉచిత సన్నబియ్యం పంపిణీ చేసిన బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు..
అగ్ని జ్వాలా ప్రతినిధి: తాండూర్
తాండూర్(నీళ్లపల్లి):
తెలంగాణ రాష్ట్రంలో పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిం చారని మండల యువజనకాంగ్రెస్, నాయకులు అన్నారు. ఉచిత సన్న బియ్యం పథకాన్ని వికారాబాద్ జిల్లా బషిరాబాద్ మండలం నీళ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులకు పంపిణీ చేసారు. ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాలకు సన్న బియ్యం అందించడం జరిగిందని అన్నారు. ఉచిత సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంటప్ప, బలరాం, ఆచారి నర్సింలు, నర్సింలు, నారాయణ, దుర్గయ్య, కొండప్ప తదితరులు పాల్గొన్నారు.

