తాండూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హబీబ్ లాలఆధ్వర్యంలో
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జై బాపు, జై భీం ,జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్
తాండూర్: వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పేందుకే జై బావు , జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టామని వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హబీబ్ లాల తెలిపారు. అధిష్టానం నిర్ణయించిన టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జై బాపు, జై భీం ,జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి తాండూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరైనారు. ఈ సందర్బంగా హబీబ్ లాల మాట్లాడుతూ.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా, మరోవైపు.. దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ఆప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని అన్నారు. సమన్వయ లోపం లేకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సర్ధార్ ఖాన్, రవికుమార్, నీరజ బాల్ రెడ్డి, అలీం, సమద్, మతిన్, అన్వర్ ఖాన్, రాజు, సయ్యద్, సిద్ధిక్, ఖయ్యుమ్ పాషా, నీరటి రామలింగం, సురేష్, కిష్టయ్య, రాజు, సుభాష్, సమీ, నర్సిము లు,భాస్కర్, తదితర పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

