కదిలిన భద్రేశ్వరుడి రథ చక్రాల
తాండూర్ అగ్ని జ్వాల ప్రతినిధి :
- వీరశైవ సమాజ సభ్యుల కోలాహలం మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్ మరియూ కార్యవర్గ బృందం .వీరశైవ కుటుంబ సభ్యుల గౌరవ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి .తాండూర్ పట్టణం లోని భద్రేశ్వర ఆలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని శ్రీ భావిగి భద్రేశ్వర జాతర రథ చక్రాల పూజ కార్యక్రమం, తర్వాత ఆలయంలో వేద పండితుల మధ్య తెలుగు నూతన సంవత్సరం పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న BSR అందరికి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఆ తరువాత ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాతర కి సంబందించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఇంతటి ప్రత్యేక కార్యక్రమంలో తనని ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ కి, వీరశైవ సమాజ సభ్యుల కి ధన్యవాదములు తెలియజేసారు.

