మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి

 

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే

మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి

మహిళలు సర్వతో ముఖభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ 

తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం

తాండూర్ :అగ్నిజాల ప్రతినిధి 

విద్యాభివృద్ధికి కృషిచేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి భారతీయ సంఘ సంస్కర్త మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే అని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం హోటల్ హిమాలయాస్ లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజ్ కుమార్ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ సబండవర్గాల అభివృద్ధికి కృషిచేసిన జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ముఖ్యంగా మహిళలు చదువుల్లో రాణించినప్పుడే దేశం పురోగతి సాధిస్తుందని సమాజంలో మహిళలు పురుషులతోపాటు సమానంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని 50% పైగా ఉన్న మహిళలకు అన్ని రంగాల్లో సమాన వాట కల్పించాలని రాజ్ కుమార్ అన్నారు

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ బిసి మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత ఉపాధ్యక్షురాలు మంజుల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసమ్మ మహిళా సంఘం పెద్దేముల్ అధ్యక్షురాలు శివలీల బషీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమని పట్టణ మహిళా కార్యదర్శి జగదీశ్వరి నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేష్ కుమ్మరి సంఘం అధ్యక్షులు పాండు రజక సంఘం అధ్యక్షులు రమేష్ బిసి మహాసేన కన్వీనర్ ఆనంద్ బిసి పెద్దమొల్ మండల యువజన సంఘం అధ్యక్షులు నవీన్,గౌడ సంఘం నాయకులు బాబా గౌడ్ బిసి సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్ బహుజన యువ నాయకులు అరుణ్ రాజ్,దుబాయ్ వెంకట్ ,జుంటుపల్లి వెంకట్, ఆనంద్, రామ్ రెడ్డి, రాజు ,సయ్యద్ లాల్, వివేక్ తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నారు

బీసీ మహిళా ప్రతినిధులను సన్మానించిన వివిధ కుల సంఘాల నాయకులు బీసీ సంఘం నాయకులు

మహిళా దినోత్సవం పురస్కరించుకొని బీసీ సంఘం అభివృద్ధికి విశిష్టంగా కృషి చేస్తున్న బీసీ మహిళా విభాగం ప్రతినిధులు అనిత,మంజుల,లక్ష్మీనరసమ్మ,శివలీల,వీరమణి,జగదీశ్వరి,ప్రమీలలను ఘనంగా సన్మానించిన జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ సుకుర్ మరియు కుల సంఘాల అధ్యక్షులు బీసీ సంఘం నాయకులు బీసీ యువ నాయకులు తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *