ప్రభుత్వం స్పందించాలి లేదంటే తీవ్ర సంక్షోభం

ఇతర రాష్ట్రాల వారిదే అధిక వ్యాపారాల్లో పెత్తనం

 

మంగలి చాకలి కుమ్మరి కమ్మరి వృత్తులలో ఇతర రాష్ట్రాల వారిదే పై చేయి  

బయటి రాష్ట్రాల పెయింటర్లు కార్పెంటర్లు ప్లంబర్లు ఎలక్ట్రిషన్లతో సబండ వర్గాలకు నష్టం

ప్రభుత్వం స్పందించాలి లేదంటే తీవ్ర సంక్షోభం

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

ఇతర రాష్ట్రాల నుండి వచ్చి మన తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాలు ప్రారంభించడంతో గత దశాబ్దాలుగా పైన వ్యాపారులు చేసుకునేవారు భారీ స్థాయిలో నష్టపోతున్నారని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు

వంశాపరంగా వచ్చే వ్యాపారంలో ఉన్న స్థానికులు గుజరాత్ రాజస్థాన్ బీహార్ హర్యానా ప్రాంతాల నుంచి వచ్చి స్థానికంగా వ్యాపారంలతో స్థిరపడడంతో అధికంగా నష్టపోయేది బీసీ కులాలకే చెందినవారేని అన్నారు

 

ఢిల్లీ సెలూన్ల పేరుతో ఆధునిక యంత్రాలతో వారు వ్యాపారం మెదలు పెట్టడంతో కులవృత్తులపై ఆధారపడి జీవించే బిసి సేవా కులాలు చెందినవారు ఇతర పనులు చేయలేక వేరే ప్రాంతాలకు వెళ్ళ లేక ఆర్థికంగా నష్టపోయి వీధిన పడుతున్నారని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు

వాయువ్య, పడమర రాష్ట్రాల నుంచి పెయింటర్లు కార్పెంటర్లు ప్లంబర్లు ఎలక్ట్రిషన్లు ఇలా అనేక వృత్తులకు చెందిన స్వయంవృత్తుల వారు పడమర రాష్ట్రాల నుండి రావడంతో సబండవర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మన ప్రాంతంలో పుట్టి పెరిగిన పేదవారు బహుజనులు అడుక్కునే పరిస్థితి వస్తుంది చిన్న చాయ్ దుకాణం దగ్గర నుండి బడా షోరూంలో వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులదే పెత్తనం ఒక్కరి ఒక్కరిగా వచ్చి నేడు యావత్ తెలంగాణ ప్రాంతంలో లక్షలలో విస్తరించారు ఇతర రాష్ట్ర వ్యాపారులతో ఉపాధి మాత్రం నిల్ నష్టం మాత్రం సంపూర్ణం ఇప్పటికైనా మన ప్రాంత ప్రజలు ఉచితలకు ఆకర్షితులు కాకుండా పనిపై దృష్టి పెట్టాలని రాజ్ కుమార్ కోరారు