నూతన ప్రజా పరిషత్ కార్యాలయం

దేవరకద్ర:అగ్ని జ్వాలా ప్రతినిధి దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో శుక్రవారం నూతన ప్రజా పరిషత్ కార్యాలయంను డిప్యూటీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తో కలిసి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసే ఎంపీడీవో కార్యాలయంను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ టి పి సి సి ఆర్గనైజ్ సెక్రటరీ కొత్త అరవింద్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా

ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి సౌకర్యాలు లేకుండా, మండల ఏర్పాటుకు గెజిట్ లేకుండా తూతూ మంత్రంగా మండలం ను ఏర్పాటు చేశారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ మంత్రిగారిని కలిసి మండల ఏర్పాటను గెజిట్ చేయించి, మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. త్వరలో ఎమ్మార్వో , ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ చైర్మన్ కథలప్ప మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ కురుమూర్తి దేవస్థానం చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి ఎంపీడీవోలు శ్రీనివాసరావు, శివ ప్రసాద్, దేవరకద్ర తహసిల్దార్ సి కృష్ణయ్య తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *