27/01/25…దమ్మపేట మండలంలో కబ్జాకు గురైన కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను సర్వే చేసి పేదలకు పంచాలని కలెక్టర్ కు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు భద్రాద్రి : అగ్నిజ్వాలా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజు ప్రజా దర్బార్ సందర్భంగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మేమరండం ఇవ్వడం జరిగినది,వారు మాట్లాడుతూ దమ్మపేట మండలంలోనే కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యకాంతమై ఉన్నవి,కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూములను సర్వే చేసి మండల పరిధిలో ఉన్నటువంటి భూములు లేని నిరుపేదలకు పంచాలని,ఎమ్మార్వోలకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా స్పందన లేదు,ఏజెన్సీ ప్రాంతంలో మా ఆదివాసి చట్టాలకు విరుద్ధంగా కొందరు భూ బకాసురులు ప్రభుత్వ భూములపై పాగా వేసి ఉన్నారని,వెంటనే వాటిని సర్వే చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది,ఈ కార్యక్రమంలో తంబళ్ల రవి,బండారు సూర్యనారాయణ,పాల్గొన్నారు.

