అర్హులను గుర్తించమంటే అరెస్టు చేస్తారా!

*అర్హులను గుర్తించమంటే అరెస్టు చేస్తారా!

 

*బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్

 

*పెద్దంపల్లిలో రెండు రోజులు గ్రామసభ నిర్వహించారు

 

*ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో నిరుపేదలను చేర్చలేదు

 

*కాంగ్రెస్ నాయకులకే పథకాలు

*అడిగినందుకు అరెస్టు చేస్తారా

*బిఆర్ఎస్ నాయకుడు పసుల రత్నాకర్

*జయశంకర్ భూపాలపల్లి జిల్లా

రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామంలో రెండు రోజులు అధికారులు గ్రామసభ నిర్వహించారు. అర్హులను గుర్తించమని అడిగిన BRS నాయకులు పసుల రత్నాకర్, సకినాల రవీందర్ ల ను పోలీసులు అదుపులోకి తీసుకొని గ్రామసభ అనంతరం వదిలేశారని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్ పసుల రత్నాకర్

వారు మాట్లాడుతూ…

పేదలకు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేర్చాలని అడిగినందుకు అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

పెద్దంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, స్పెషల్ ఆఫీసర్లు ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారని అందులో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో లేకపోవడంతో అధికారులను నిలదీశామని తెలిపారు. దీంతో తిరిగి శుక్రవారం గ్రామసభ నిర్వహించారని అన్నారు. గ్రామ సభకు రాకుండా పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారని అన్నారు. గ్రామసభ అనంతరం వదిలి పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, అధికారులు కలిసి అక్రమ అరెస్టు చేస్తే సహించేది లేదన్నారు. పథకాలాన్ని కాంగ్రెస్ నాయకులకే వర్తిస్తాయని ప్రశ్నించారు. పెద్దంపల్లి గ్రామంలో తిరిగి సర్వే నిర్వహించి అర్హులను గుర్తించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పేదలకు ఇందిరమ్మ ఇంత జాబితాలో చేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి పై, ఎంపీడీవో పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపీడీవోను అర్హులను గుర్తించాలని అడిగినందుకు నాపై అగ్రహం వ్యక్తం చేశాడని పసుల రత్నాకర్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో పై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, బండి రమేష్,నాయకులు గోగుల చంద్రకర్ రెడ్డి, జలందర్,తడక శ్రీకాంత్, సకినాల రవీందర్, గుర్రం రమేష్, వజ్జీరు నివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *