విద్య వైద్యం భోజనం పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు

 

* తాండూరు పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు

*విద్య వైద్యం భోజనం పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు

* ప్రభుత్వ అధికారుల వైఫల్యమే అని  సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ అన్నారు 

 

తాండూరు:అగ్నిజ్వల ప్రతినిధి :పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ఎస్టి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో జరిగిన సంఘటన పూర్తిగా ప్రభుత్వ అధికారుల వైఫల్యం అని ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల ప్రభుత్వ అధికారుల పిల్లలకు ఇలాంటి నాణ్యతలేని ఫుడ్ పెడితే ఊరుకుంటరా అని అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ హాస్టల్లో పాఠశాల గురుకులల్లో వివక్ష చూపెడుతూ సరైన భోజనం విద్య వైద్యం అందించకపోవడం సిగ్గుచేటని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్య వైద్యం భోజనం పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్న పరిస్థితి ఉందని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి నాణ్యత ఉన్న భోజనం విద్య వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురై పిట్టల రాలుతూ అనేక మంది చనిపోతున్నా పరిస్థితి ఉంది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి హాస్టల్లో గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలలో అనేక ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగులోనికి చూస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది తాండూరు పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్య గాని వైద్యం అందించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకుల పాఠశాలలో ప్రభుత్వ హాస్టలల్లో ప్రభుత్వ పాఠశాలలలో ఫుడ్ పాయిజన్ తో అనేక మంది పేద విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల పైన నాణ్యమైనటువంటి విద్యను భోజనానికి మౌలిక సదుపాయలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల కనీస సౌకర్యాలను మెరుగుపరచాలని పెండింగ్ లో ఉన్న మధ్యాహ్నం భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని అప్పగించరాదని వంట షెడ్ ఏర్పాటు చేయాలని పేద పిల్లలు కార్మికుల రైతుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న సందర్భంగా విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రవేట్ పాఠశాలలో అధిక ఫీజు అరికట్టాలని డిమాండ్ సిపిఎం నాయకులు సురేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *