తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు కెసిఆర్ కు ఆహ్వానం

తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు కెసిఆర్ కు ఆహ్వానం

 

హైదరాబాద్:అగ్నిజ్వాల ప్రతినిధి :

  1. తెలంగాణ రాజకీయాల్లో నేడు ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసు కుంది. ఎల్లుండి డిసెంబర్ 9 నాడు సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు వెళ్లి ప్రభుత్వం తరపున కేసీఆర్‌ను ఆహ్వానించారు.
మరోవైపు తెలంగాణ గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను, రూపు రేఖల ను రేవంత్ రెడ్డి సర్కారు మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
అందుకే విగ్రహంలో మార్పు లు చేసినట్లు ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతు న్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని చాటుకోవడం కోసమే పేర్లు, విగ్రహాలు మార్చుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *