*తర్వలో సర్పంచ్ ఎన్నికలు.. ఓటు హక్కు లేదా..? అయితే ఓటు నమోదుకు ఇదే లాస్ట్ డేట్..!!*
తెలంగాణలో తర్వలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీసీ కుల గణనకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
అనంతరం ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల చేయన్నన్నట్లు సమాచారం. కాగా.. రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కులేని వారికి నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎస్‌ఎస్‌ఆర్-2025లో భాగంగా 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా తమ ఓటుహక్కు కోసం నమోదు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. వీరితోపాటు ఓటర్ల జాబితాలో పేరు లేని 18 సంవత్సరాలు నిండినవారు కూడా నమోదుకు తెలంగాణ ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

