కోర్టు సూచనల మేరకు దర్యాప్తు జరగాలి : అవుసుల యోగానంద్
కౌంటింగ్ కేంద్ర ఘటనపై న్యాయపోరాటం ఫలితం : బీఆర్ఎస్ కౌన్సిలర్ యోగానంద్
చట్టానికి అందరూ సమానమే : ఎమ్మెల్యే కేసుపై బీఆర్ఎస్ స్పందన
కోర్టు ఆదేశాలతోనే ఎమ్మెల్యేపై కేసు నమోదు అవుసుల యోగానంద్
manasa news ప్రతినిధి తాండూరు ఎమ్మెల్యేపై నమోదైన ఎఫ్‌ఐఆర్ విషయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ31వ వార్డు కౌన్సిలర్ అవుసుల యోగానంద్ విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని, ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని తెలిపారు.దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అవుసుల యోగానంద్ పేర్కొన్నారు. ఈ కేసులో సక్రమంగా దర్యాప్తు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.అయితే ఈ అంశాన్ని రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం ఖండనీయమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి అందరూ సమానమేనని, కోర్టు ఆదేశాల మేరకు నమోదైన కేసును రాజకీయ రంగు పులమడం తగదని సూచించారు.

