తాండూర్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగ
లేబర్ కార్డుతో సంక్షేమ పథకాలు పొందండి – మే డే పిలుపు
తాండూర్లో ఘనంగా మే డే వేడుకలు – కార్మికులకు సన్మానం
తాండూర్, manasa news ప్రతినిధి : ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎన్టీయూసీ తాండూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిసిసి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధారాసింగ్ నాయక్ మే డే జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. కార్మికులు లేబర్ ఆఫీస్లో సభ్యులుగా చేరి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందాలని సూచించారు.మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు మాట్లాడుతూ, కార్మిక సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కార్మికులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.

