సన్మాన సభలో కీర్తి కిరీటం ధరించిన గ్రూప్ 1 విజేత క్రాంతి
యువతకు స్ఫూర్తి దీపంలా వెలిగిన తాండూర్ ప్రతిభావంతుడు క్రాంతి
రాష్ట్రస్థాయి విజయంతో మాదాసి కురువ సంఘానికి గర్వకారణమైన క్రాంతి
వికారాబాద్ మాదాసి కురువ ఎస్సి సంఘం సత్కరణ
శాలువా, పూలదండలతో సత్కారం – సంఘం తరపున క్రాంతి కిఅభినందనలజల్లు
న్యాయవాది గోపాల్ కుమారుడు క్రాంతి గారి ప్రతిభకు ఘన గౌరవం
అగ్నిజాల ప్రతినిధి :తాండూర్
వికారాబాద్ జిల్లా మాదాసి కురువ ఎస్సి సంక్షేమ సంఘం అధ్యక్షులు కే.కే. నరసింహం మదాసి కురువ ఆధ్వర్యంలో తాండూర్ కు గర్వకారణం, ప్రముఖ న్యాయవాది కే. గోపాల్ కుమారుడు క్రాంతి గ్రూప్-1 పరీక్షల్లో అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా క్రాంతి ని శాలువా కప్పి, పూలదండలు వేసి సత్కరించారు.నాయకులు మాట్లాడుతూ –మన సంఘానికి ఇది గౌరవ క్షణం. తాండూర్ నేలలో పుట్టిన క్రాంతి తన ప్రతిభతో రాష్ట్రస్థాయిలో వెలుగొందారు. ఆయన సాధించిన ఈ విజయం యువతకు స్ఫూర్తి దీపంలా నిలుస్తుంది. భవిష్యత్తులో ప్రజల సేవలో ఆయన మరింత వెలుగులు నింపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం” అన్నారు.ఈ మహోత్సవ సన్మాన కార్యక్రమంలో ఒగ్గు బిర్లా సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పూజారి మల్లప్ప, మదాసి కురువ సంఘం పెద్దిముల మండల అధ్యక్షులు మంబాపూర్ ధనరాజ్, మారేపల్లి పెంటప్ప, గుడిసె ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొని క్రాంతి పై అభినందనలు కురిపించారు.

