కృషికి గుర్తింపు: క్రాంతి గ్రూప్ సర్టిఫికెట్ స్వీకారం
అడ్వకేట్ గోపాల్ కుమారుడు ఎంపీడిఓగా నియమితుడు
సీఎం చేతుల మీదుగా క్రాంతి నియామక ఎంపీడిఓ పత్రం
అడ్వకేట్ గోపాల్ కుమారుడు క్రాంతి గ్రూప్ స్థానిక నాయకత్వంలో కొత్త మైలురాయి
అగ్ని జ్వాలా ప్రతినిధి తాండూర్
వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన ప్రముఖ అడ్వకేట్ గోపాల్ కుమారుడు క్రాంతి కృషి – ప్రతిభల ఫలితంగా గ్రూప్ – 1 పోస్ట్ ఎంపీడీఓగా నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా తాండూర్ ప్రాంతీయ ప్రజలు, బంధుమిత్రులు, రాజకీయ, సామాజిక ప్రముఖులు క్రాంతి ని ఘనంగా అభినందించారు. సమాజ సేవ పట్ల అంకితభావం, ఉన్నత లక్ష్యసాధన పట్ల పట్టుదల, కష్టానికి లొంగని మనసు ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చినవని పలువురు అభిప్రాయపడ్డారు.తన తండ్రి అడ్వకేట్ గోపాల్ ప్రేరణ, ఆశీస్సులు, కుటుంబ సభ్యుల అండతో సమాజానికి సేవ చేయాలనే సంకల్పం తోడై క్రాంతి ఈ విజయాన్ని సాధించడం ప్రాంతీయ యువతకు స్ఫూర్తిదాయకమని అందరూ ప్రశంసించారు.ప్రజల పట్ల మమకారం, నిబద్ధతతో కూడిన ప్రజాహిత భావన కలిగిన క్రాంతి భవిష్యత్తులోనూ తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించి ప్రజాభిమానాన్ని చూరగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. “క్రాంతి విజయమే తాండూర్ కు గర్వం” అని పలువురు కొనియాడారు.

