బీజేపీ నేతలతో స్వచ్ఛ భారత్

తెలంగాణ విమోచన దినోత్సవం నుంచి గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు

పరిశుభ్రత–పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన బీజేపీ నాయకులు

సేవ పక్షం లో భాగంగా తాండూర్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

అగ్ని జ్వాల ప్రతినిధి : తాండూర్

భారతీయ జనతా కేంద్ర పార్టీ పిలుపు మేరకు సేవ పక్షం కార్యక్రమాల భాగంగా, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, దేశ ప్రధాని జన్మదినం సందర్భంగా ప్రారంభమైన సేవా కార్యక్రమాలు, అక్టోబర్ 2న లాల్ బహుదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ జయంతుల వరకు కొనసాగనున్నాయి.ఈ క్రమంలో నేడు తాండూర్ రాసులపురం శ్రీ హనుమాన్ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పటేల్ విజయ్ కుమార్, సాయి రెడ్డి, నరేందర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, జుంటుపల్లి వెంకటేష్, ఆకుల శివ, మ్యాతారి లాలు, రమ్యనాయక్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *