తాండూర్ అభివృద్ధికి బాటలు వేసిన మహానాయకునికి ఘన నివాళి
ప్రజల కోసం శ్రమించి, ప్రజల కోసం జీవించిన శ్యాం సుందర్ స్మరణ సభ
ప్రజల బాటలో నడిచిన మహానుభావుని జ్ఞాపకాలు మనకెన్నడూ వెలుగునిస్తాయి
ప్రజల బాటలో నడిచిన మహానుభావుని జ్ఞాపకాలు మనకెన్నడూ వెలుగునిస్తాయి
తాండూర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు – శ్యాం సుందర్ గారి స్మరణ సభ
అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్
మనం స్మరించుకుంటున్నది ఒక సాధారణ మనిషి కాదు…ప్రజా సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన,ప్రతీ ఒక్కరికి అండగా నిలిచిన నీరటి శ్యాం సుందర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్, అనేక సేవాకార్యక్రమాల పితామహుడు మంచితనానికి, కర్తవ్యనిష్ఠకు ప్రతీక.ఆయన హృదయం కేవలం కుటుంబానికే కాదు,అందరి కష్టాలకు తోడుగా ఉండటానికే కొట్టుకుంది.తాండూర్ నియోజకవర్గనికి వెలుగునిచ్చిన దీపస్తంభంలా నిలిచిన వ్యక్తిత్వం ఆయనది.ఆయన చూపిన మార్గం, విలువలు ఈ రోజూ మనలో ప్రేరణ నింపుతున్నాయి.అందుకే ఆయనను స్మరించుకోవడం మనందరికీ ఒక పవిత్ర కర్తవ్యం.
20 ఆగస్టు 2025, బుధవారం ఉదయం 11 గంటలకు
గ్రీన్ సిటీ కాలనీ, తాండూర్ లో
చతుర్థి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది అయన భార్య నీరటి సైదమ్మ, పోట్లీ మహారాజ్ దేవస్థానం డైరెక్టర్, కుమారులు నీరటి భాస్కర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , నీరటి రామలింగం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అక్క బావలు నీరటి శారదా దేవి వెంకటేశం, మనవలు నీరటి విజయ్ ఆదిత్య, అజయ్ కుమార్ విజయ్ కుమార్ , మనవరాళ్లు నీరటి లిఖితాదేవి, నీరటి హర్షిని దేవి, నీరటి హారిక దేవి అందరూ కలిసి ఈ వర్ధంతి సభలో పాల్గొని,తమ తండ్రి, తాతలకి నివాళులు అర్పించనున్నారు.

