“లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ”

 

 

లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ – గ్రామంలో పండుగ వాతావరణం”

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో కరణ్ కోట్‌లో 104 ఇళ్లు మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల రూపంలో నిరుపేదలకు ఇంటి కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి

అగ్నిజ్వాల,:ప్రతినిధి తాండూర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ గ్రామాల్లో పండుగ వాతావరణం – లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీపీ‌సీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, నిరుపేదలకు నేరుగా ₹5 లక్షల ఇళ్ల నిర్మాణ సహాయం అందించాలన్న తన మాటను నేడు నిజం చేశారు.స్థానిక ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి కృషి, సహకారంతో కరణ్ కోట్ గ్రామంలో మొత్తం 104 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో ఇప్పటికే 34 మంది బేస్మెంట్ పూర్తి చేసుకోగా, నేడు 30 మందికి ఒక్కొక్కరికి ₹1 లక్ష చొప్పున నిధులు వారి అకౌంట్లలో జమ కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపి పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచుకుని గ్రామం అంతా ఉత్సవ వాతావరణం నెలకొల్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ గారు, శరన్ బసప్ప గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు శివకుమార్, సునీల్, శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు టి. అనిల్ కుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి. రాజు, మైనారిటీ నాయకులు అల్తాఫ్ ఇమ్రాన్, రాఫిఫ్, గ్రామస్తులు లొంగటి నరసిములు, బయమోల వెంకటేశ్, పట్నం వెంకటేశ్, కట్టెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *