పద్మభూషణ్ మాదిగకు తాండూర్‌లో సన్మానం

 

 

జిల్లా అధ్యక్షులు కే.కే. నరసింహం పాల్గొని ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు

తెలంగాణ మదారి/మదాసి కురువ సంఘం ప్రతినిధులు పూలమాలతో సన్మానం

ఎస్సీ వర్గీకరణలో ముఖ్యపాత్ర పోషించినందుకు ఘనంగా గుర్తింపు

పద్మభూషణ్ మాదిగకు తాండూర్‌లో సన్మానం

అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్

వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతంలోని గాగ్రాణి ఫంక్షన్ హాల్‌లో ఇటీవల నిర్వహించిన వికలాంగుల చేయూత సమావేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రధాన అతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు.సాంఘిక సమరస్యత మరియు ఎస్సీ వర్గీకరణలో ముఖ్యపాత్ర పోషించినందుకు ఆయనకు ఎస్సీ వర్గాల్లో గొప్ప గుర్తింపు లభించింది. ఇదే సందర్భంగా, తెలంగాణ మదారి/మదాసి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం, వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో, సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆయనను శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే.కే. నరసింహం, తాండూర్ సెక్రటరీ బలరాం మాదాసి కురువ, రాజప్ప మాదాసి కురువ, బి. అంజయ్య మదాసి కురువ, పల్లె నరసింహ మదాసి కురువ, కొంపల్లి దస్తయ్య మదాసి కురువ, ప్రవీణ్ మాదాసి కురువ, రాజు మహేష్ కురువ మరియు పెద్దముల్ మండల అధ్యక్షులు దస్తప్ప మదారి కురువ, పెంటప్ప పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *