కోటపల్లి విలేజ్ జట్టుకు ద్వితీయ బహుమతి ₹2,500
నాగశానపల్లి జట్టుకు ప్రథమ బహుమతి ₹5,000
8 జట్లు పోటీపడి ఉత్కంఠ రేపిన వాలీబాల్ పోటీలు
కోటపల్లి మండలంలో మెడి స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ వైభవంగా
అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్
కోటపల్లి మండలం కేంద్రంలో శుక్రవారం మెడి స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రీడా మహోత్సవంలో మొత్తం 8 జట్లు పాల్గొని మైదానాన్ని ఉత్కంఠభరితంగా మార్చాయి.ప్రారంభ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మేడం గారు, ప్రజా ప్రతినిధులు క్రీడాకారులకు పరిచయం చేసి, వారి ప్రతిభ, క్రీడాస్ఫూర్తిని కొనియాడుతూ అభినందించారు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య సాగిన ఫైనల్ మ్యాచ్‌లో నాగశానపల్లి జట్టు అద్భుత ప్రతిభ కనబరచి ప్రథమ బహుమతిగా ₹5,000 గెలుచుకుంది. కోటపల్లి విలేజ్ జట్టు శ్రద్ధతో పోరాడి రెండవ బహుమతిగా ₹2,500 అందుకుంది.మెడి స్టార్ హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలను అభివృద్ధి పరచడం,యువతలోక్రీడాస్ఫూర్తిపెంపొందించడం తమ లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

