14,15న ఆంజనేయ స్వామి ఉత్సవాలు

*ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి అందరికి ఆహ్వానం

ఆహ్వనించిన మాజీ జెడ్‌పిటిసి,ప్రస్తుత టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్

అగ్నిజ్వాలా ప్రతినిధి:పెద్దేముల్

పెద్దేముల్ మండల కేంద్రం లోని పెద్దేముల్ అనుబంధ గ్రామమైన పెద్దేముల్ తాండలో నూతనంగా ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు.అందులో భాగంగా స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఈ నేల 14,15 వ తేదిలల్లో నిర్వహిస్తున్నట్లు పెద్దేముల్ మండల్ మాజీ జెడ్‌పిటిసి, ప్రస్తుత టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయక్ తేలిపారు.14 వ తేదీ గురువారం నాడు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన మరియు నవగ్రహ ప్రతిష్టాపన 15 వ తేది శుక్రవారం నాడు ద్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.ఉత్సవాలలో రోజు మధ్యాహ్నం 1 గంటల నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలియజేసారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని తీర్థ, ప్రసాదాలు స్వీకరించి భగవత్ కృపకు పాత్రులు కాగలరని కొరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *