ధరసింగ్ ఫోన్ టాపింగ్ కేసులో హాజరు
అగ్నిజ్వాలా ప్రతిని:తాండూర్
సీనియర్ నాయకుడు మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధరసింగ్ ఫోన్ టాపింగ్ కేసు విచారణలో భాగంగా ఈరోజు అధికారుల ముందు హాజరయ్యారు. విచారణ అధికారుల పిలుపుమేరకు ఆయన హైదరాబాద్‌లోని సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ శాఖకు చేరుకొని, తన వాదనలు సమర్పించారు.ఫోన్ టాపింగ్‌కు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో, ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విచారణ పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.ధరసింగ్ మీడియాతో మాట్లాడుతూ, “నాకు చట్టంపై పూర్తి నమ్మకం ఉంది. నిజం నావైపే ఉంది,” అంటూ తన స్థాయిని స్పష్టంచేశారు. కేసు విచారణ భాగంగా పోలీసులు ఎప్పుడు పిలిచినా వారికి సహకరిస్తానని తెలిపారు

