హైకోర్టు ఇచ్చిన గడువుకు ముందే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

హైకోర్టు ఇచ్చిన గడువుకు ముందే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

*బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది

*ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో టిఆర్ఎస్ బిజెపి ఫెయిల్

జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

అగ్నిజ్వాలా ప్రతినిధి :తాండూర్ 

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ జీవో జారీ చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు ఆమోదింప చేయడం అర్షనీయమే కానీ ఈ బిల్లు కేంద్రం ప్రభుత్వం ఆమోదింప చేయకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరించడం లో బీసీల లో అనుమానాలు తలెత్తుతున్నాయి అన్నారు సప్టెంబర్ 30 లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు రావడంతో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎటువంటి అడ్డంకి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంపై చర్యలు తీసుకునేందుకు తగిన సమయం లభించిందని రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి నెలరోజుల సమయం సరిపోతుందని రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలకు వెళ్తే బీసీలు ఎట్టి పరిస్థితుల్లో సహించరని రాజ్ కుమార్ అన్నారు భారత రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని 73 -74 వ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6 ప్రకారం స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్రానికి ఇచ్చిందన్నారు ఇప్పటికైనా బీసీల విషయంలో రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధితో రిజర్వేషన్ల అమలుకు కార్యచరణ చేపట్టాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పెంపు అంశమై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలతో పాటు టిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఫెయిల్ అయ్యాయని రాజ్ కుమార్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *