ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన పరిగి తహసీల్దార్ ఆనందరావును వెంటనే సస్పెండ్ చేయాలని నిరసన

అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్

తాండూర్ :పరిగి మండలం, రంగం పల్లి గ్రామానికి చెందిన 1-00 ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన,అదే గ్రామంలో 20-23 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమార్కులకు కట్టబెట్టి,గోవిందాపూర్ గ్రామం రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 52 లో 16-00 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి,అక్రమ మట్టి వ్యాపారస్టలతో కుమ్మకై మట్టి వ్యాపారం చేస్తున్న పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు ను వెంటనే సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చెయ్యడం జరిగిందిఈ సందర్బంగా *సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం కే చంద్రయ్య* మాట్లాడతూ. పరిగి మండలం,రంగంపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 146 మొత్తం విస్తీర్ణం :4-17ఎకరాలు కలదు. ఈ భూమి ఖారేజ్ ఖాతా (సర్కారి) భూమి కొంతమంది పేదలు ఖాస్తులో ఉండగా వారిని జీవనదారం కొరకు కొందరికి పాసుబుక్కులు ఇచ్చారు. ఇట్టి భూమి అమ్మడం కొనడం నేరం, కాని మన పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు మాత్రం డబ్బులకు ఆశపడి ప్రభుత్వ భూమిని తేది :09.09.2024 నాడు వేరే వ్యక్తులకు 146/ఈ /2 లో 1-00 ఎకరం రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ భూమి మళ్ళీ వేరే వ్యక్తులకు అమ్మడానికి స్లాట్ బుక్ చేసి,వేరే వ్యక్తులకు అమ్మడానికి ప్రయత్నించగా ఆ భూమి ప్రభుత్వ భూమి అని ఇది రిజిస్ట్రేషన్ చెయ్యడానికి విలులేదు అని అధికారులు చెప్పారు.ఈ విషయం ఇతరులను ఆశ్రహించగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ బండారం బయటపడింది. పహాని రికార్డ్ లో ఈ భూమి స్వబావం 1954-55(ఖస్రా),1955-56(చసాల) ఖరీజఖాతా (సర్కారి) భూమిని పేర్కొనబడినది. అంటే ఇది ప్రభుత్వ భూమి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చెయ్యడం చట్టావిరుద్ధం.కాని ఆనంద్ రావు కు మాత్రం చట్టాలను తుంగలో తొక్కి చుట్టాలుగా మార్చుకుంటాడు.  రంగం పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 256 విస్తీర్ణం:20-23 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి కలదు.ఈ భూమిలో 15 నెలలుగా చదును చేస్తూ చెట్లు, గుట్టను చదును చేస్తన్న తహసీల్దార్ ఆనంద్ రావు ప్రతి నెల అక్రమార్కుల నుండి లక్షల రూపాయలు లంచం తీసుకొని ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమార్కుల చేతిలో పెట్టాడు. పర్యావరణన్ని నాశనం కావాడానికి ప్రోత్సహించరు. గోవిందా పూర్ రెవెన్యూ పరిది లోని సర్వే నెంబర్ 52 లో 16 ఎకరాలు సీలింగ్ భూమిని లక్షల రూపాలు తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు.పరిగి మండలంలో అక్రమ మట్టి వ్యాపారులతో కుమ్మకై రాత్రి,పగలు తేడా లేకుండా మట్టి దందా కొనసాగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నడు . ఇలా ఈ తహసీల్దార్ గురించి చెప్పుకుంటూ పోతే మనకు ఈ పేజీలు సరిపోవు    గతంలో దూద్యాల మండలంలో తహసీల్దార్ గా ఆనంద్ రావు పని చేసినప్పుడు గౌరారం గ్రామానికి చెందిన ఒక పట్టాదారుడు చనిపోతే అతని కుమారునికి విరసత్ చేయాల్సిన 1-17 గుంటల భూమి కుమారికి విరసత్ చేయకుండా లక్షల రూపాయలు తీసుకొని వేరే వ్యక్తులకు పట్టా చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ పిర్యాదు చేసిన అప్పుడు పట్టించుకోలేదు .అందుకే అదే దిమాతో ఈలాంటి అవినీతి ,అక్రమాలు చేసిన నన్ను ఎవ్వరు ఏమి చెయ్యరు అనే దీమతో పరిగి తాహసిల్దార్ ఆనంద్ రావుఇలావ్యవరిస్తున్నాడు.అందుకని ఈ అవినీతి, అక్రమాల తహసీల్దార్ ఆనంద్ రావు పై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు వావుబ్ MHPS తాండూర్ పట్టణ అధ్యక్షులు సాదిక్ KNPs వికారాబాద్ జిల్లా కార్యదర్శి జి రత్నం సిఐటియు తాండూరు పట్టణ నాయకులు మహబూబ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *