Citu నిరంతర పోరాటాల ఫలితమే మినీ అంగన్ వాడి టీచర్స్ 306 జీవో విడుదల
సీఐటీయు ఆధ్వర్యంలో తాండూర్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ అంగన్వాడీ టీచర్స్ ను మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా అప్ గ్రేడ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.12 నెలల వేతనాలు (ఏరియర్స్) వెంటనే చెల్లించాలి
అగ్ని జ్వాలా:ప్రతినిధి: తాండూర్
మినీ అంగన్వాడీ టీచర్స్ ను మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా (2024 జనవరిలో) రాష్ట్ర ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. అయితే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వలేదు.జీవో రానందున వీరికి పెరిగిన వేతనాలు(ఏరియర్స్)12 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ లో పెట్టింది. ఈ సమస్యను పరిష్కరించాలని, అధికారికంగా జీవో ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 12 నెలల వేతనాలు (ఏరియర్స్) వెంటనే చెల్లించాలని అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించాము. ప్రతినెల అధికారులకు వినతి పత్రాలు అందజేశాము. ప్రాజెక్టు, జిల్లా స్థాయిలో అనేక పోరాటాలు నిర్వహించాము. హైదరాబాద్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేశాము. శాసనసభ్యులకు ఎమ్మెల్యేలకు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు అందజేశాము. చలో హైదరాబాద్ లు నిర్వహించాము. మార్చి 4న ప్రజావాణిని ముట్టడి చేశాము.మార్చ్ 17,18 తేదీల్లో రెండు రోజులు 48 గంటల ధర్నా కలెక్టర్ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు చేసి నిరసన తెలియజేయడంతో పాటు కలెక్టర్ ఆఫీసులను దిగ్బంధనం చేశాము.ఈ విధంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరంతరం చేసిన పోరాటాల ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్స్ ను మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా అప్ గ్రేడ్ చేస్తూ 306 జీవోను విడుదల చేసింది. పోరాడి విజయం సాధించిన 4 వేల మంది మినీ అంగన్వాడీ టీచర్లకు అభినందనలు. వీరి పోరాటానికి అండగా నిలబడ్డ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ జీవోలో 12 నెలల పెండింగ్ వేతనాలు(ఏరియర్స్) పైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.వీటి పైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి. 12 నెలల పెండింగ్ వేతనాలు(ఏరియర్స్) ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని, ఈ పెండింగ్ వేతనాలకు సరిపడా బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము.

