డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి 14న మహానీయుల జయంతి ఉత్సవాల సభను జయప్రదం చేయాలని
తాండూర్ డివిజన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ
ఏప్రిల్ 14 జయంతి బహిరంగ సభ జయప్రదం చేయాలి
తాండూర్ డివిజన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కే శ్రీనివాస్
అగ్నిజ్వల ప్రతినిధి :తాండూర్
తాండూర్ నియోజకవర్గంలో ఉన్న దళిత ప్రజా సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జయంతి బహిరంగ సభ జయప్రదం చేయాలి కరపత్రం విడుదల తాండూర్ డివిజన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మేధావులు యువకులు, ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అంబేద్కర్ యువజన సంఘాలు దళిత ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయండి తమ జాతి హక్కుల కోసం కాకుండా ప్రజలందరికీ సమాన హక్కులు పోరాడిన మహనీ యులు ప్రజలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాన హక్కుల కోసం ప్రజలందరికీ ఓటు హక్కు ని ఆయుధంగా ఇచ్చిన మహనీయుడు అని అన్నారు కుల వివక్ష అంటారనితనంపై ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల హక్కుల కోసం దళితులపైన మహిళలపై అణగారిన వర్గాల పై అణిచివేత కులవివక్ష పై మతోన్మాద దోపిడి విధానాలకు వ్యతిరేకంగా కార్మికులకు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసి తమ కుటుంబాన్ని త్యాగం చేసి ప్రజల కోసం పోరాడినారని ఇప్పటి పాలకులు కులం పేరుతో మతం పేరుతో ప్రజల మధ్యలో చిచ్చులు పెడుతూ రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై కుట్రలు చేస్తూ ప్రజలకు కార్మికులకు రైతులకు ఉన్న హక్కులు కాలరాస్తున్నారని అని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల చరిత్రని నేటి యువతరం యువతీ యువకులు వారు చేసిన త్యాగాలను ఆదర్శాలని తెలుసుకొని భవిష్యత్ తరాలకు బాటలు వేయలని అన్నారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రజలు యువకులు కాపాడుకోవాలని ప్రతి గ్రామంలో మహానీయుల యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు మహానీయుల జయంతి కార్యక్రమాలకు సహకరించాలని తాండూర్ డివిజన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీఅధ్యక్షులు కే శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వై రాములు ఉపాధ్యక్షులు మెట్లీ ఆశన్నఉపాధ్యక్షులు u బుగ్గప్ప ఉపాధ్యక్షులు పి నర్సింలు ఉపాధ్యక్షులు అబ్దుల్ వాబ్సహాయ కార్యదర్శి కే చంద్రయ్య సహాయక కార్యదర్శి కే మల్లికార్జున్ సహాయ కార్యదర్శి ఏ ప్రకాష్ కోశాధికారి ఎం ఎం వెంకటేష్ ప్రధానకార్యదర్శిఆనంద్ కుమార్ కమిటీసభ్యులు డి అంజిలప్ప యు మల్కప్ప ర ఘుపతి జి రత్నం సామి దాస్ కృష్ణ ఎం గజలప్ప జె నరేష్ బలరాం సిహెచ్ రవికుమార్ డి రాజ్ కుమార్ పి నరసింహులు మ్యాథరి సురేష్ విజయ్‌కుమార్ చందు తదితరులు పాల్గొన్నారు

