అక్రమ ప్రకృతి సంపధను అరికట్టాలి
బొంరాస్ పేట్ మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని ప్రజా సంఘాల డిమాండ్
అగ్నిజ్వల ప్రతినిధి: కొడంగల్
అక్రమ ఇసుక వ్యాపారం సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార ప్రజా సంఘాల డిమాండ్ బొంరాస్ పేట్ : మండలంలో అక్రమ ఇసుక వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలని, అక్రమ ఇసుక వ్యాపారాన్నికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేడువ్యవసాయ కార్మిక సంఘం – CITU – MRPS, అంబేద్కర్ సంఘం, LHPS – ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం – KNPS – మైనారిటీ హక్కుల పోరాట సమితి. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బొంరాస్ పేట్ తహసీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా.ఎం. వెంకటయ్య, అబ్దుల్ వాహబ్, బుస్స చంద్రయ్య, కొత్తూరు చెంద్రయ్య మాట్లాడుతూ.. బొంరాస్ పేట్ మండలంలో గత కొన్ని నెలలుగా అక్రమ ఇసుక మైనింగ్ వ్యాపారము విచ్చలవిడిగా కొనసాగుతుందని సంబంధిత అధికారులు అట్టి ఇసుక అక్రమాలను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని దురదృష్టకరమన్నారు. ఈ ఇసుక వ్యాపారము పోలీస్, కొంతమంది రెవిన్యూ అధికారుల కనుసన్నుల్లో నడుస్తుందని వారు ఆరోపించారు, కొడంగల్ లో అభివృద్ధి పేరుతో తాసిల్దార్ గారి దగ్గర రెండు ట్రాక్టర్ల లేదా టిప్పర్స్ పర్మిషన్ టోకన్స్ తీసుకొని100 ట్రాక్టర్ల లేదా టిప్పర్స్ అక్రమంగా అమ్ముకుంటున్నారనిఅన్నారు. అక్రమ ఇసుక వ్యాపారాన్ని నియంత్రించవలసినటువంటి ఎస్ఐ,మైనింగ్ మరియు కింది స్థాయి రెవెన్యూ అధికారులు అక్రమాలకులతో కుమ్మకై చూసి చూడనట్లు వ్యవరించడం దుర్మార్గం అన్నారు. అక్రమ ఇసుక వ్యాపారం వల్ల భూగర్భ జలాలు అంతరించిపోవడం, వరదలు రావడం, సారవంతమైన నేలలు పాడవడం, పర్యావరణ దెబ్బతినడం వంటి అనార్ధాలు జరుగుతున్న వాటన్నిటినీ కాపాడవాసిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి అక్రమాలకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజు అనేక ట్రాక్టర్లు ట్రిప్పర్లు అక్రమంగా పోలీస్ స్టేషన్,రెవెన్యూ కార్యాలయాల ముందు నుంచి సరఫరా చేస్తుంటే పట్టించుకోవడంలేదని అన్నారు. ఇలా నియంత్రించవలసిన అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాస్తే భవిష్యత్తులో పోరాటం తప్పదన్నారు.ఇప్పటికైనా ఈ అక్రమ ఇసుక వ్యాపారంపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వం డిమాండ్ చేశారు. లేనియెడల బొంరాస్పేట్ తాసిల్దార్ కార్యాలయం ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హేచ్చరించడం జరిగిందిఈ కార్యక్రమంలో నాయకులు ముస్తఫా, లక్ష్మయ్య, సుభాష్, అనంత్తయ్య, రత్నం, మల్లప్ప, బలప్ప తులజానాయక్, నరేందర్, వెంకటయ్య,నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

