ఢిల్లీలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి

ఢిల్లీలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి

 

 

ఐదు దశాబ్దాల క్రితం తాండూరు వేదికగా బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టా

నిబద్ధత కలిగిన బిసి ఉద్యమ నాయకులు రాజ్ కుమార్ సయ్యద్ శుకూర్లు

జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య

ఆర్ కృష్ణయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన తాండూర్ బీసీ నాయకులు రాజ్ కుమార్ తదితరుల

బీసీ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు జాతీయ స్థాయి ఢిల్లీలో చేపట్టే నిరసన కార్యక్రమాలలో తాండూర్ నుండి పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూర్ నేతృత్వంలో ఈరోజు ఉదయం తాండూర్ నియోజవర్గ బీసీ మహిళా బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య ను మర్యాదపూర్వకంగా హైదరాబాదులో కలిశారు

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్య ఉద్యోగ రంగాల్లో గత పోరాటాలతో కొంత విజయం సాధించామని రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా బీసీల ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలన్నారు బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు తాండూర్ ప్రాంతంలో బీసీలు ఎక్కువ జనాభాలో ఉన్నారని 50 సంవత్సరాల క్రితం బీసీ ఉద్యమాన్ని తాండూర్ నుండే మొదలుపెట్టానని ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీ నేతలు కందుకూరి రాజ్ కుమార్ సయ్యద్ సుకుర్ బీసీ సమస్యలపై అనేక పోరాటాలలో పాలుపంచుకున్నారని నిబద్ధత కలిగిన బీసీ ఉద్యమ నేతలు రాజ్ కుమార్ శుక్కుర్లు అని ఆర్ కృష్ణయ్య కొనియాడారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ బీసీ మహిళ అధ్యక్షురాలు మధు లత శ్రీనివాస్ చారి మహిళా తాండూర్ డివిజన్ అధ్యక్షురాలు అనిత ఉపాధ్యక్షురాలు మంజుల నరసమ్మ కార్యదర్శి జగదీశ్వరి యలల మండల అధ్యక్షులు లక్ష్మణ చారి యువ నాయకులు శ్రీనివాస్ అరుణ్ రాజ్ విజయ్ కుమార్ ఫయాజ్ రాములు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *