పాలమూరు యూనివర్సిటీలో ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు

పాలమూరు యూనివర్సిటీలో ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు
ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ తనగల గడ్డం భరత్ బాబు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు.యూనివర్సిటీ కాలేజీ ముందు BRSV నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేశారు.అనంతరం బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్ బాబు మాట్లాడుతూ….ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియమకాలలో జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్రపాలక నాయకులపై కన్నెరజేసీన కేసిఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా 2001,ఏప్రిల్ 27 న టీఆర్ఎస్ పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా నీళ్ళు,నిధులు,నియామకాల ఎజెండాగా ఉద్యమాన్ని ఉదృతం చేసి అలుపెరుగని అనేక పోరాటాలు చేసి చావును సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ జాతిపిత కేసిఆర్ అని అన్నారు.
రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు అధికారం ఇచ్చారని,అద్భుతమైన పథకాలతో కేసిఆర్ గారు పాలన దక్షతను కనబరిచారని,భారతదేశ పటంలో తెలంగాణ ఖ్యాతిని పెంచిన ఘనత కేసీఆర్ గారిదేనని తెలిపారు.అలాగే ఎంతోమంది విద్యార్థి నాయకులకు రాజకీయంగా భవిష్యత్ ను ఇచ్చిన ఘనత కేసిఆర్ గారిదని,ప్రభుత్వ పక్షంపై నిత్యం ప్రజా సమస్యలపై కోట్లాడే వ్యక్తి కేసిఆర్ అని,రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ యూనివర్సిటీలో నాయకులు తిరుమలేష్ నాయుడు,తిరుమల్, మహేంద్ర,మదన్ మమత,చంద్రకళ, శిరీష,మనీషా,కావ్య,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *