అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన తాండూరు పట్టణం..

కనుల పండుగగా పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పడిపూజ..

 

 

అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన తాండూరు పట్టణం..

తాండూరు:అగ్ని జ్వాలా ప్రతినిధి : స్వగృహంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు వందలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి భజనలు, సంకీర్తనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూరు పట్టణం మారుమొగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి పల్లకి, భక్తిశ్రద్ధలతో ఆడుతూ పాడుతూ అయ్యప్ప నామ స్మరణ పటిస్తూ కొనసాగించారు. ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో సకల దోషాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *